టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. దీంతో ఏకంగా కొత్త నిబంధననే తీసుకురానుంది. ఇందులో భాగంగానే ప్లేయర్లు టీమిండియా జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో పాల్గొనాలంటే.. ఆ టోర్నీ కంటే ముందు కొన్ని రంజీ మ్యాచులు ఆడటాన్ని తప్పనిసరి చేయనుంది. ఒకవేళ రంజీల్లో ఆడేందుకు నిరాకరిస్తే ఐపీఎల్ లేదా ఫ్రాంఛైజీలు రిలీజ్ చేసినప్పుడు మళ్లీ వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదనే నిబంధన పెట్టాలని భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa