జాతీయ రహదారులు 340సి, 340బి, 167కె లకు సంబంధించి భూ సేకరణ జరిగి అవార్డు ఎంక్వయిరీ పూర్తయిన వాటికి పరిహార చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఛాంబర్ లో జాతీయ రహదారుల భూసేకరణ, పరిహార చెల్లింపు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.