ఏపీలో ఎన్నికల వేళ ఢిల్లీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలపై ఇప్పుడిప్పుడే పురోగతి కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనలో ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆస్తుల బదలాయింపులు: రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆస్తుల బదిలీలపై ప్రభుత్వం 2014లో కమిటీలను ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఆస్తులపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండు ప్రభుత్వాల అధికారులు తమ ప్రతిపాదనలను అందజేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఢిల్లీలో ఉమ్మడి ఆస్తుల విభజనకు మార్గం సుగమమైంది.