ఆండ్రియ.. స్పెయిన్ అమ్మాయి. భాష్యం అఖిల్.. బంగారుపాళ్యం మండలం గుంతూరుకు చెందిన అబ్బాయి. రిటైర్డు డీఎ్సడీవో సుదర్శన్నాయుడు కుమారుడైన ఇతడు జర్మనీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. అక్కడి యూనివర్సిటీలో యోగా టీచరుగా పనిచేస్తున్న ఆండ్రియాతో పరిచయమైంది. ఆ పరిచయం పెళ్లి పీటల వరకు చేరింది. బుధవారం కాణిపాకంలోని ఆలయంలోని హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఆండ్రియ తల్లిదండ్రులు, బంధువులు హాజరయ్యారు.