నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వెంకటాచలం మండలం పవన్ కాలనీకి చెందిన 64 ఏళ్ల జయమ్మ, 60 ఏళ్ల రాజేశ్వరి మూడు రోజులు కిందట అధృశ్యమయ్యారు. వీరిద్దరూ నెల్లూరులోని కూరగాయల దుకాణానికి వెళ్లారు. దుకాణం వెనుక గదిలో రక్తపు మరకలు, చెప్పులు, కళ్లజోడును పోలీసులు గుర్తించారు. దుకాణం యజమాని పరారీలో ఉన్నాడు. మహిళలు ధరించిన బంగారు ఆభరణాల కోసం హతమార్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల ఆచూకీ, దుకాణం యజమాని కోసం ముమ్మర గాలింపు నిర్వహిస్తున్నారు.