రైతు సంఘాలతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. అయితే రైతుల డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరడానికి ఆదివారం సమావేశం అవుతామని చెప్పారు.
పంటకు కనీస మద్దతు ధర, రుణమాఫీకి చట్టపరమైన హామీతో సహా పలు డిమాండ్లపై కేంద్రంతో చర్చ జరిగిందని కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు.