ఏపీలోని శ్రీశైల మల్లికార్జునస్వామివారికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు రథసప్తమి సందర్భంగా స్వర్ణ రథాన్ని కానుకగా అందజేశారు.
ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లను వెండి రథంపైనే ఊరేగిస్తుండగా, తొలిసారిగా స్వర్ణ రథం సమకూరింది. కాగా, 23.6 అడుగుల ఎత్తుతో బంగారు తాపడం చేయించిన ఈ రథం తయారీకి సూమారు రూ.11 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.