పేటీఎంకు తాజాగా మరో షాక్ తగిలింది. ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను టోల్ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL) తొలగించింది. తాము సూచించిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని IHMCL సూచించింది. అయితే పేటీఎం వ్యాలెట్‌లో ఉన్న డబ్బులు అయిపోయేంత వరకు ఫాస్టాగ్‌కు అవి వినియోగించుకోవచ్చు. పేటీఎంపై RBI ఆంక్షల నేపథ్యంలో IHMCL ఈ చర్యలు తీసుకుంది.