టీడీపీతోనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతి సాధ్యమని టీడీపీ హిందూపురం పార్లమెంటరీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాగూర్‌హుస్సేన పేర్కొన్నారు. పట్టణంలోని 27వ వార్డులో గల ముస్లిం కుటుంబాలకు గురువారం ఆయన మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి యాసినసూర ఫొటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగూర్‌హుస్సేన మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ముస్లింల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలందరూ టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు అత్తార్ రహీంబాషా, నాయకులు రాళ్లపల్లి షరీఫ్, ఇమాములు, అస్లాం, మహబూబ్‌బాషా, ఉస్మాన, టీడీపీ పట్టణాధ్యక్షుడు పరిశేసుధాకర్, నాయకులు పాల్గొన్నారు.