ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది దంపతులు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లయి ఏళ్లకేళ్లు గడిచినా.. వారికి పిల్లలు పుట్టడం లేదు. దీంతో రకరకాల పద్దతులు అవలంభించి.. పిల్లలు పుట్టేలా చికిత్సలు తీసుకుంటున్నారు. అక్కడి వరకు ఓకే కానీ.. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మాత్రం మీకు దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి.. తన భార్యకు ప్రెగ్నెన్సీ తెప్పించడానికి.. తన వీర్యంతోపాటు తన తండ్రి వీర్యాన్ని కూడా కలిపాడు. ఆ రెండు వీర్యాలను కలిపి తన భార్య శరీరంలో ప్రవేశపెట్టాడు. దీంతో ఆమెకు గర్భం రావడంతోపాటు పండంటి మగ బిడ్డ జన్మించాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఆ భర్త చాలా జాగ్రత్త పడ్డాడు. కానీ చివరికి ఆ పిల్లాడికి 5 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ విషయం బయటపడింది. దీంతో ఈ ఘటన కాస్త కోర్టుకెక్కింది.
ఇంగ్లాండ్‌లోని బార్న్‌స్లీలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన అంతా గతంలోనే జరగ్గా.. ఇప్పుడు ఆ మహిళకు ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ విషయం మొత్తం అంతా గుట్టుగా జరగ్గా.. ఆ మహిళ భర్త ఎవరికీ జరిగిన ఘటన గురించి చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఇన్నేళ్లు రహస్యంగానే ఉన్న ఈ విషయం స్థానిక కౌన్సిల్.. ఆ పిల్లాడికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించి.. తల్లిదండ్రులు ఎవరో గుర్తించడానికి చేసిన ప్రయత్నంలో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో ఆ కౌన్సిల్ కోర్టుకు ఎక్కగా.. కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ భర్త కోర్టుకు చేసిన విజ్ఞప్తితో వారి వివరాలను బయటికి వెల్లడించలేదు.
సంతానోత్పత్తి సమస్యల వల్ల ఐవీఎఫ్ చికిత్సకు అయ్యే ఖర్చును భరించే శక్తి లేని ఓ వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై స్థానిక కౌన్సిల్ కోర్టుకెక్కడంతో ఆ వ్యక్తి చివరికి తాను చేసిన పనిని వెల్లడించాడు. తన భార్యకు గర్భం రావడానికి తన వీర్యంతోపాటు తన తండ్రి వీర్యాన్ని కూడా కలిపినట్లు అంగీకరించాడు. ఆ మిక్స్‌డ్ వీర్యాన్ని తన భార్యకు ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆమె గర్భం రావడానికి కారణం అయింది. దీంతో ఆ మహిళ ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. ఆ విషయం రహస్యంగా ఉంచగా.. తాజాగా స్థానిక కౌన్సిల్ చేసిన పనికి ఆ తతంగం మొత్తం బయటపడింది.
ఆ 5 ఏళ్ల బాలుడు.. తన తండ్రి, తాత వీర్యం మిక్స్ చేయడం వల్ల పుట్టాడని తెలిసింది. దీంతో ఆ పిల్లాడికి బయలాజికల్ తండ్రి ఎవరు అని నిర్ధారించేందుకు పరీక్ష చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ స్థానిక కౌన్సిల్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం పూర్తిగా విచారణ జరిపిన కోర్టు.. ఈ విషయంలో స్థానిక కౌన్సిల్‌కి ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. పౌరుల ఖచ్చితమైన జనన రికార్డులను నమోదు చేసే కౌన్సిల్ ప్రక్రియను సమర్థించిన కోర్టు.. అదే సమయలో పౌరుల వ్యక్తిగత విషయాలపై అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.