ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో కేరళ సంతతి కుటుంబం మరణాల వెనుక భారతీయ టెక్కీ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 11:25 PM

అమెరికాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ, అతడి భార్య అలైస్ ప్రియాంక బెనజర్ వారి ఇద్దరు కవల పిల్లలు నోహ్, నీతాన్‌లు ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాత్‌రూమ్‌లో దంపతులు తుపాకీ గాయాలతో మృతి చెందగా..ఓ బెడ్‌రూమ్‌లో పిల్లలు చనిపోయి కనిపించారు. ఈ మరణాల వెనుక భారతీయ టెక్కీ పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు.


హెన్రీకి లైసెన్స్‌డ్ 9 ఎంఎం హ్యాండ్‌గన్ ఉందని శాన్ మాటియో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నలుగురి మరణాలకు ఆనంద్ హెన్రీని అనుమానితుడిగా గుర్తించామని పోలీసు శాఖ తెలిపింది. ‘మా దర్యాప్తులో ప్రియాంకకు ఎక్కువ గాయాలు ఉన్నాయని, హెన్రీ ఒకే షాట్‌‌‌కు గురైనట్టు గుర్తించాం.. పిల్లల మరణాలకు కారణాలు తెలియాల్సి ఉంది.. అయితే వారు తుపాకీ కాల్పుల వల్ల చనిపోవం లేదా శారీరంపై ఎటువంటి గాయం గుర్తులు లేవు’ అధికా తెలిపారు.


కేరళకు చెందిన ఈ కుటుంబం గత తొమ్మిదేళ్లగా కాలిఫోర్నియాలో ఉంటోంది. ఆనంద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. అలైస్ సీనియర్ ఎనలిస్ట్. ఆనంద్ 2016లో విడాకులు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదు. ఘటనకు కుటుంబ సమస్యలే కారణమని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. 2016లో ఆనంద్‌ విడాకులకు దరఖాస్తు చేశాడని.. కానీ పొందలేకపోయాడని అతడి స్నేహితులు పేర్కొన్నారు. భారత సంతతి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇటీవలి కాలంలో ఇది రెండోది కావడం గమనార్హం.


గత ఏడాది డిసెంబరులో రాకేష్‌ కమల్‌, అతడి భార్య టీనా, వారి 18 ఏళ్ల అమ్మాయి మసాచుసెట్స్‌లోని వారి నివాసంలోనే చనిపోయి కనిపించారు. ఇంట్లో హింస జరిగిన చరిత్ర లేదని, వారి ఇంటికి సమీపంలోకి సింహం రావడంతో పోలీసులు ఒకసారి వెళ్లారని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com