గుంతకల్లు పట్టణంలోని 11 బిసి కుల సంఘాలకు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి స్థల పట్టాలను ఆయా కుల సంఘాల పెద్దలకు అందజేశారు. కసాపురం రోడ్డులోని ఏబి ఫంక్షన్ హాలు సమీపంలోని ప్రభుత్వ భూమిని ఒకొక్క కుల సంఘానికి 18 సెంట్లు స్థలం మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిసి సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.