శబరిమల అంటే గుర్తుకు వచ్చేది కేరళ. కానీ శబరి వెళ్లలేని వారికోసం ఏపీలోనూ ఓ అయ్యప్ప దేవస్థానం ఉంది. ఏపీలోని నెల్లూరులో అయ్యప్ప సేవాసమాజం వారు శబరిమలను తలపించేలా అయ్యప్ప గుడి నిర్మించారు.
నెల్లూరుకి ఓ వైపున రంగనాయకులు గుడి, మరోవైపున అయ్యప్ప గుడి ఉంటాయి. శబరిమల ఆలయం లాగే ఇక్కడ కూడా ఉపాలయాల నిర్మాణం ఉంది. ఏపీలో కూడా ఇరుముడి సమర్పించే అతి కొద్ది ఆలయాల్లో నెల్లూరు అయ్యప్ప గుడి కూడా ఒకటి.