అనుచరుల వద్ద వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని 55 సర్పంచ్ స్థానాల్లో వైసీపీ గెలుస్తారన్నారు.
మిగిలినవన్నీ టీడీపీ సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. అప్పుడు టెక్కలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులను బయటకు రాకుండా చేశాం. ఒకరకంగా రౌడీయిజమే చేశాం. 136 పంచాయతీల్లో 119 గెలిచాం.’ అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.