విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యానించారు.
టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పని చేశారంటూ ఆరోపించారు. ఢిల్లీలో నారా లోకేశ్ ఏఏ లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని అతనే వైసీపీకి చేరవేశారన్నారు. ఒకప్పుడు చంద్రబాబు కోసం పూజలు చేసిన నాని.. ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.