పులివెందుల పరిధిలోని బెస్తవారిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ. 500 కోట్లతో ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలను నెలకొల్పారు. కళాశాలలో మొదటి సంవత్సరం 100 సీట్లు కేటాయిస్తారు. ఈనెల చివరి వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేత ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.