వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అచ్చెన్నాయుడు అన్నారు. అలాగే టీడీపీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు నిరాకరిస్తున్నారని ఆరోపించారు.
జగన్ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు పెట్టి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాప్తాడులో జగన్ సభకు హైవే పక్కన నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.