పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
భూమికి 190 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. స్వల్ప స్థాయిలోనే భూమి కంపించడం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం.