సీపిఎస్ ఉద్యోగులకు విజయవాడ పోలీసులు ఝలక్ ఇచ్చారు. సిపిఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
విజయవాడలో 30, 144 సెక్షన్లు అమలులో ఉన్నాయని విజయవాడ కమిషనర్ ఆఫీస్ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.