భారతదేశంలోని అతిపెద్ద జీవితబీమా సంస్థ.. ఎల్ఐసీ (LIC) కీలక ప్రకటన చేసింది. కేవలం పిల్లల కోసం మరో కొత్త బీమా పథకం లాంఛ్ చేసింది. అదే ఎల్ఐసీ అమృత్‌బాల్ పథకం అని LIC పేర్కొంది.
ఇది వ్యక్తిగత, సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. 2024, ఫిబ్రవరి 17 నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. పిల్లల పైచదువులు సహా ఇతర ఎన్నో అవసరాలకు కార్పస్ సృష్టిస్తుంది. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని LIC తెలిపింది.