రాప్తాడులో సిఎం జగన్ వైకాపా సిద్ధం సభ సందర్భంగా పోలీసులు తమను అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని సిపిఎం, సిపిఐ నాయకులు గోవిందు, నరసయ్య మండిపడ్డారు. సిఎం సభ నేపథ్యంలో ఆదివారం గుంతకల్లు పోలీసులు వామపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ కు తరలించారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న వామపక్ష నాయకులకు రెండు రోజుల నోటీసులు అందజేసి అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు.