జాతీయ భాష హిందీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కార్యాలయంలో హిందీ ప్రచార సభ డైరీలను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 1939లో స్థాపించిన హిందీ ప్రచార సభలో మన భారత ప్రధానమంత్రులు కూడా చదువుకున్నారని గుర్తుచేశారు. ప్రాథమిక స్థాయి నుంచే హిందీ మాట్లాడేలా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.