అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని తాడిపత్రి భాజపా నాయకులు ఆదివారం పేర్కొన్నారు. తాడిపత్రి స్థానిక పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ మైన నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. వైకాపా నాయకులు ప్రకృతి వనరులైన కొండలు, గుట్టలను కొల్లకొట్టడమే కాకుండా ఇసుక, మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకుని అక్రమాలు సాగిస్తున్నారని ఆరోపించారు.