అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు మరో ఫీట్‌ని సాధించారు. ఈ మేరకు చెక్కతో తయారు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహాన్ని రూపొందించారు.
దీనికి లిగ్నోసెట్ అని పేరు. ఇది త్వరలో ప్రయోగానికి సిద్ధంగా ఉంది. లిగ్నోసెట్ మాగ్నోలియా కలపతో తయారు చేయబడింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన ప్రయోగాలలో స్థిరంగా మరియు పగుళ్ల నిరోధకతను కలిగి ఉంటుందని తేలింది.