ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకోవడమే మనందరి ధ్యేయం అని కళ్యాణదుర్గం టిడిపి ఇన్ చార్జి ఉమామహేశ్వరనాయుడు తెలిపారు. సోమవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పతకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు.