పపువా న్యూ గినియా దేశంలో గిరిజన తెగల మధ్య ఆదివారం జరిగిన హింసాకాండ ఘోర విషాదాన్ని మిగిల్చింది. కనీసం 53 మంది వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఆ దేశంలోని రిమోట్ హైలాండ్స్ ఎంగా ప్రావిన్స్‌లో ఈ హింసాకాండ జరిగింది.
అడవుల్లోకి చాలా మంది క్షతగాత్రులు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. రోడ్లు, నదీ తీరాల్లో పడి ఉన్న మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa