మధ్యప్రదేశ్ గుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని డిల్లోడ్ గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. తుల్సా బాయి (80) ఈ నెల 14న మరణించింది. ఆచారం ప్రకారం ఆమె మృతదేహాన్ని దహనం చేయాలి.
అంత్యక్రియల ఖర్చు తప్పించుకునేందుకు రాత్రి వేళ తల్లి మృతదేహాన్ని కుమారుడు జగదీష్ గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి ఓ గోతిలో పడేశాడు. పోలీసులు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బంధువులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa