బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఇంకోసారి పొత్తులపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డిని బీజేపీ హెచ్చరించిందట. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలపై కూడా సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.