విమానయాన సంస్థలకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టుల్లో విమానం ల్యాండింగ్ తర్వాత 30 నిమిషాల్లోగా ప్రయాణికులకు వారి బ్యాగేజ్ అందించాలని సూచించింది.
ప్రయాణికులు లగేజీ కోసం గంటల కొద్దీ వేచి చూస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.