ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను అంకితం చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వాటిని ప్రారంభించనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు కూడా విద్యా రంగానికి సంబంధించినవే. ఇవి వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందినవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.