ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు దాడి చేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు రఘువీరారెడ్డి ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో దాడులు సరైన పద్ధతి కాదన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ సీఎం జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్లు, విలేకరులపై దాడి చేయడం దిగజారుడు తనమేనన్నారు. దాడిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ వైద్యానికయ్యే ఖర్చులు వైసీపీ భరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్.. శ్రీకృష్ణకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.