ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనంతపురం ‘‘సిద్ధం’’ సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పాత్రికేయ వృత్తి ఫోర్త్ ఎస్టేట్‌గా భావిస్తాం అటువంటిది ఫొటో జర్నలిస్టుపై పాశవిక దాడికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పాత్రికేయ వృత్తిని గౌరవించలేని వారికి ప్రజాస్వామ్యం పై నమ్మకం ఏముంటుందని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు.