ఫేస్బుక్ పరిచయం.. ప్రేమగా మారింది. వివరాల్లోకి వెళ్ళితే..... చిత్తూరు జిల్లా, పాలసముద్రం మండలం గంగమాంబాపురం గ్రామానికి చెందిన దీపిక (19)కి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేశారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరగాల్సివుంది. ఈ క్రమంలో ఫేస్బుక్ పరిచయంతో ప్రేమికుడిగా తిరుపతి జిల్లా తడ మండలం రామాపురం గ్రామానికి చెందిన విఘ్నేష్ వద్దకు ఈనెల 15న వెళ్లిపోయింది. మేజర్లయిన వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు విషయం తెలియకపోవడంతో దీపిక కనిపించడం లేదని పాలసముద్రం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు ఆ జంట ఆచూకీ తెలుసుకున్నారు. సోమవారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ జానకిరామ్ ఇరువురు తల్లిదండ్రులతో మాట్లాడి, ఇద్దరూ మేజర్లు కావడంతో డీటీ మధుబాబు ఎదుట హాజరుపరిచారు. దీపిక తాను ప్రేమికుడి వెంటనే వెళతానని చెప్పడంతో తల్లిదండ్రులు మిన్నకుండి పోయారు.