రాప్తాడులో టీడీపీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. పరిటాల సునీత సమక్షంలో టీడీపీలోకి పలువురు చేరారు. ఎన్నికల సమయానికి రాప్తాడులో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని పరిటాల సునీత ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి, కన్వీనర్ ముత్యాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర, బీసీసెల్ అధికార ప్రతినిధి ఎజ్జేశంకర్, ప్రధానకార్యదర్శి ముత్యాలప్ప, మాడెంసూర్యనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, పణి పాల్గొన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత అనంతపురం క్యాంపు కార్యాలయంలో సోమవారం రాప్తాడు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పరిటాల సునీత టీడీపీ నేతలకు ఎన్నికలకు సంబందించి దిశా నిర్ధేశం చేశారు.