రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు చేసిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. సభల్లో జగన్ చొక్కాలు మడతపెట్టండని పిలుపును ఇవ్వడం దీనికే సంకేతమా అని ప్రశ్నించారు. ఆయన పిలుపు ఇవ్వగానే వైసీపీ కార్యకర్తలు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు.