పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో సోమవారం శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయాల పునర్నిర్మాణ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ బి. కృష్ణ మోహన్ దంపతులు పాల్గొన్నారు. సుమారు రూ 1.50 లక్షల వ్యయంతో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్, జిల్లా ఫారెస్టు అధికారి రామచంద్రరరావు, డిప్యూటీ కలెక్టర్ బి. నారధముని కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.