మిలాన్-24లో పాల్గొనేందుకు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ ఈనెల 22న, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 21వ తేదీన నగరానికి రానున్నారు. ఉప రాష్ట్రపతి 22వ తేదీ ఉదయం 8.10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 10.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టులోని ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి 10.50 గంటలకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుని ఇంటర్నేషనల్ మేరీటైమ్-2024 సెమినార్‌ను ప్రారంభిస్తారు. సెమినార్ అనంతరం 12.55 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీలో బయలుదేరి 3.15 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఎన్‌ఎస్ చోళాకు వెళతారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు సముద్రిక ఆడిటోరియంకు చేరుకుని మిలాన్ వేడుకలు ప్రారంభిస్తారు. తిరిగి ఐఎన్‌ఎస్ చోళాకు చేరుకుని రాత్రి 7.15 గంటలకు నేవీ అధికారులు ఇచ్చే విందుకు హాజరవుతారు. 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు బయలుదేరి జగదల్‌పూర్ వెళతారు.