గుంతకల్లు మండలం కసాపురం గ్రామ సమీపంలో నిర్మించిన రాతి దేవాలయంలో ఈనెల 22న ప్రతిష్ఠ చేయనున్న శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహాలను సోమవారం ఆలయ వ్యవస్థాపకుడు తలారి పరశురామ్ ఆధ్వర్యంలో ఊరేగించారు. స్థానిక బీరప్ప కూడలి నుంచి శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహాలను ప్రత్యేక వాహనంలో కొలువుతీర్చి ఊరేగించారు. యాత్రలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, జనసేన నాయకులు వాసగిరి మణికంఠ భక్తులు పాల్గొన్నారు.