రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థతో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైందని మంగళవారం ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండల పరిధిలోని ఈస్ట్ నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డా. వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ గోదాము భవనాలను మరియు సలకంచెర్వులో గ్రామ సచివాలయాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి ప్రారంభించారు.