యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి మంగళవారం షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, MLC పదవికి స్వామిప్రసాద్ మౌర్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు పంపించారు.
ఇక ఆయన కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరి 22న న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ అనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.