ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటో గ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గం విలేఖరులు మంగళవారం అంబేద్కర్ విగ్రహం నుంచి టీ సర్కిల్, గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారికి, టౌన్ స్టేషన్ లో ఏఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు న్యాయం చేయాలని, దోషులను భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.