ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రత్యర్థులను అంతమొందించడానికి ఎంత వరకైనా వెళ్లడం పుతిన్ నైజం. ఇక అత్యంత కఠినమైన వ్యక్తి అని కూడా ఆయనకు పేరు ఉంది. తాను అనుకున్నది చేసేవరకు వదిలిపెట్టకపోవడం పుతిన్ లక్షణమని.. ప్రస్తుతం 2 ఏళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చూస్తేనే అర్థం అవుతోంది. ఇలాంటి కఠినమైన వ్యక్తి కూడా ప్రేమకు దాసోహం అని తాజాగా నిరూపితం అయింది. అది కూడా 71 ఏళ్ల వయసులో. ప్రస్తుతం ఓ మహిళతో పుతిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తన కంటే వయసులో చాలా చిన్నదైన ఓ మహిళతో పుతిన్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి.
39 ఏళ్ల ఎకాథరీనా మిజులినాతో వ్లాదిమిర్ పుతిన్ కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు రష్యాలోని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే పుతిన్ అనుకూల వ్యక్తి అయిన మాజీ సెనెటర్ ఎలెనా మిజులినా కుమార్తెనే ఎకాథరీనా మిజులినా. ఎకాథరీనా మిజులినా ప్రస్తుతం క్రెమ్లిన్‌కు మద్దతుగా ఉండే సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌కు చీఫ్‌గా ఉన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు పుతిన్‌పై వచ్చే విమర్శలను ఇంటర్నెట్ నుంచి తొలగించడమే ఈ సేఫ్ ఇంటర్నెట్ లీగ్ ప్రధాన కర్తవ్యం.
అయితే అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే ఎకాథరీనా మిజులినాతో ఈ మధ్యకాలంలో పుతిన్ చాలా సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. పుతిన్ వయసు 71 ఏళ్లు కాగా.. ఎకాథరీనా వయసు 39 ఏళ్లు. పుతిన్ కంటే ఆమె 32 ఏళ్లు చిన్నది అని తెలుస్తోంది. గతంలో చైనాను సందర్శించే రష్యన్ ప్రతినిధులకు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన ఎకాథరీనా.. 2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌లో చేరారు. అయితే ఇదే అదను అని భావిస్తున్న ఉక్రెయిన్ మీడియా.. ఎకాథరీనాతో పుతిన్ ప్రేమ వ్యవహారం నిజమేనంటూ కథనాలు వెల్లడిస్తోంది. టెలిగ్రామ్ ఛానళ్లలో కూడా ఇదే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక గతంలో వివాహం అయిన పుతిన్ తన భార్యకు విడాకులు ఇచ్చారు. పెళ్లి అయిన 30 ఏళ్ల తర్వాత 2014 లో తన భార్య లియుడ్మిలాకు పుతిన్ విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత జిమ్నాస్ట్, ఒలిపింక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అలీనా కబయేవాతో పుతిన్ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కూడా ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలీనా కబయేవా కోసం పుతిన్ భారీగా డబ్బు ఖర్చు చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో అలీనాతోపాటు ముగ్గురు పిల్లలను స్విట్జర్లాండ్‌లోని ఓ లగ్జరీ విల్లాలో భారీ సెక్యూరిటీ మధ్య పుతిన్ ఉంచినట్లు కథనాలు వెలువడ్డాయి.