ఏపీ సీఎం జగన్ విద్యావ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే గతేడాది విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..
ఈ ఏడాది జూన్ నాటికి జూనియర్ కళాశాలలు ఏర్పాటు కావాలని నిర్దేశించారు. తాజాగా ఏపీలోని ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 210 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.