సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్నుమూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు.
అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. రాజ్యసభ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.