రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేయడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ పట్టణంలోని 17వ వార్డు నారాయణమ్మ కాలనీ మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా ప్రతి గడప గడపకు తిరుగుతూ సీఎం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.