దేశవాళీ క్రికెట్‌కూ వీడ్కోలు పలకబోతున్న మనోజ్ తివారీ తన కెరీర్‌లో జరిగిన సంఘటనలను వెల్లడించాడు. గౌతమ్ గంభీర్‌తో ఓ సారి మైదానంలో జరిగిన వాగ్వాదంపై స్పందించాడు. ‘‘గౌతమ్ గంభీర్‌తో ఆ రోజు మైదానంలో వాగ్వాదంపై ఇప్పటికీ బాధపడుతుంటాను. నా గురించి తెలిసిన వాళ్లు అలా ఎలా ప్రవర్తించావని అడుగుతున్నారు. నా కెరీర్‌లో చెరిపేసే జ్ఞాపకాల్లో అదొకటి. ఎందుకంటే దాని వల్లే నాకున్న మంచి పేరు నాశనమైంది.’’ అని తివారి వివరించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa