జైపూర్ మహారాజు జై సింగ్ ఒకసారి లండన్ వెళ్ళారు. సాధారణ దుస్తులలో రోల్స్ రాయిస్ కార్ల షోరూమ్‌కి వెళ్లి వాటి గురించి ఆరా తీశాడు. సేల్స్ మాన్ ఆ బట్టల్లో రాజును చూసి లెక్కచేయలేదట.
దీంతో మహారాజు చాలా అవమానంగా భావించి మరోసారి రాజ వేషధారణలో షోరూమ్‌కి వెళ్ళి 10 కార్లను ఆర్డర్ చేశాడు. భారత్ లోని తన ప్యాలెస్‌కు కార్లను డెలివరీ చేయాలని, అలాగే ఆ సేల్స్ మ్యాన్‌ను తప్పక పంపాలని కూడా చెప్పాడు. కార్లు భారత్ వచ్చాక సేల్స్ మాన్ ముందు వాటిని చెత్త బండిలా మార్చాడట.