6, 8 తరగతి చదువుతున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో నారాయణ రావు సోషల్ టీచర్‌గా పని చేస్తున్నాడు.
క్లాస్ రూమ్‌లో బాలికలతతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దాంతో బాలికలు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్‌కి ఆందోళనకు దిగారు. దాంతో యాజమాన్యం టీచర్‌ను సస్పెండ్ చేసింది.