జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను హెచ్చరించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుండి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో మంగళవారం వీడియో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.