జగనన్న ప్రభుత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గపరిధిలోని అన్ని గ్రామాల్లో నేరుగా సంక్షేమ పథకాలు లక్ష 80 వేల మందికి వాలంటీర్ల ద్వారా అందించిందని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఎర్రగొండపాలెంలోని వైష్ణవి గార్డెన్స్ లో వాలంటైర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని వాలంటిర్లు పాల్గొన్నారు.